పసికందు మృతదేహంతో రోడ్డుపై ఆందోళన

పసికందు మృతదేహంతో రోడ్డుపై ఆందోళన
  • మృతికి ప్రభుత్వ డాక్టర్లు కారణమని బాధిత కుటుంబం ఆరోపణ
  • సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘటన  

సిరిసిల్ల టౌన్, వెలుగు :  ప్రభుత్వ డాక్టర్ల నిర్లక్ష్యంతోనే పసికందు చనిపోయాడని ఆరోపిస్తూ ఓ కుటుంబం రోడ్డుపై ఆందోళనకు దిగిన ఘటన సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగింది . బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. సిరిసిల్లలోని అశోక్ నగర్ కు చెందిన రాగట్ల స్వరూప వారం కింద స్థానిక జిల్లా ప్రధాన ఆస్పత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఐదు రోజుల కింద పసికందుకు సీరియస్ గా ఉందని మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లాలని డాక్టర్లు కుటుంబసభ్యులకు సూచించగా కరీంనగర్ లోని ఓప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.

అక్కడి నుంచి హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స చేయిస్తుండగా సోమవారం పసికందు చనిపోయాడు.  దీంతో బాధిత కుటుంబ ఆవేదన చెందుతూ ప్రభుత్వ ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యంతోనే తమ బాబు చనిపోయాడని ఆరోపిస్తూ మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించి నిరసనకు దిగారు.  పోలీసులు వెళ్లి న్యాయంలో చేస్తామని హామీ ఇవ్వడంతో బాధిత కుటుంబం నిరసన విరమించింది. కాగా  పసికందు జెనెటిక్ డిజార్డర్ తో పుట్టడడంతో మెరుగైన వైద్యంతో కోసం మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లాలని సూచించినట్లు ఏరియా ఆస్పత్రి డాక్టర్లు తెలిపారు.